సీబీఐ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది.. వైఎస్ సునీత
YS Viveka's daughter Sunitha said that CBI is doing its work.
దిశ, కడప: మాజీమంత్రి వై.ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన పని తాను చేసుకుంటూ వెళ్తోందని ఆయన కుమార్తె డాక్టర్ సునీత పేర్కొన్నారు. వివేకానందరెడ్డి 72వ జయంతి పురస్కరించుకొని మంగళవారం పులివెందులలోని వైఎస్ వివేకానందరెడ్డి సమాధి వద్ద డాక్టర్ సునీత, ఆమె భర్త నరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలసి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం వివేకా జయంతి పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సునీత విలేకరులతో మాట్లాడుతూ.. నాన్న బతికి ఉంటే ఈ రోజు 72వ జన్మదినోత్సవం అయి ఉండేదన్నారు. నాన్న జన్మదినం పురస్కరించుకొని కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయన్నారు.
పాఠశాలలో చదువుకునే రోజుల్లో తన గురించి ఎవరో ఏమో అన్నారని చాలా బాధపడుతున్నానన్నారు. అప్పుడు నాన్న ఒక సలహా ఇచ్చాడన్నారు. ఎవరైనా మన గురించి పెద్దగా పొగిడితే పట్టించు కోవాల్సిన అవసరం లేదన్నారు. మన గురించి తప్పులు చెపితే అది సీరియస్ గా గ్రహించి మనోలోని లోపాలను కరెక్షన్ చేసుకోవాలని నాన్న చెప్పారన్నారు. ఈ రోజు ఇవన్నీ గుర్తుకు వస్తున్నాయన్నారు. తాను మొదటి నుంచి చెపుతున్నానని, నాన్న హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు వారి విధులు వారు నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో తన జోక్యం అవసరం లేదని, వాళ్ల పని వాళ్లు చేస్తారన్నారు. సీబీఐ దర్యాప్తు పై ఎలాంటి కామెంట్ చేయనన్నారు.
Read More..
వివేకా హత్యకేసు దర్యాప్తు సంస్థలపై ఎవరి జోక్యం ఉండకూడదు : వైఎస్ సునీత