Viveka Case: అందుకే నిజం చెప్పా.. నన్ను కాపాడండి: దస్తగిరి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిల నుంచి తనకు ప్రాణమాని ఉందని దస్తగిరి ఆరోపించారు..

Update: 2023-04-17 13:16 GMT
Viveka Case: అందుకే నిజం చెప్పా.. నన్ను కాపాడండి: దస్తగిరి
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిల నుంచి తనకు ప్రాణమాని ఉందని దస్తగిరి ఆరోపించారు. వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఎర్రగుంట్లలో సోమవారం మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్, అవినాశ్‌ల నుంచి ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందని చెప్పుకొచ్చారు. తాను అప్రూవర్‌గా మారారని, చాలా మంది తనపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్రూవర్‌గా మారేవేళ అవినాశ్ లాంటి వాళ్లు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

‘మీ వరకు రానంతవరకు దస్తగిరి మంచోడు.. మీ వరకు వచ్చేసరికి ఇప్పుడు చెడ్డవాడినా?’ అని ప్రశ్నించారు. వైఎస్ సునీత, సీబీఐ నుంచి తాను రూపాయి కూడా తీసుకోలేదని చెప్పుకొచ్చారు. ఆ అవరసం రాదని చెప్పారు. అప్పుడు డబ్బుకు ఆశపడే ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు చేశామని..ఇప్పుడు తనకు ఆ అవసరం లేదని వెల్లడించారు. కాబట్టి సీబీఐకి జరిగిన వాస్తవం ఏంటో చెప్పానని వెల్లడించారు. పలుకుబడి ఉందని సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ను కూడా మార్చేశారని చెప్పారు. రామ్ సింగ్‌ను మార్చితే కొత్త బృందం కొత్తకోణంలో విచారిస్తుందా? అని సందేహం వ్యక్తం చేశారు. వివేకా హత్యకేసులో మీ పాత్ర తెలుసు కనుక ఎవరైనా అలాగే దర్యాప్తు చేస్తారని దస్తగిరి సెటైర్లు వేశారు.

Read more:

సీఎం జగన్ అనూహ్య నిర్ణయం! 

Tags:    

Similar News