Kadapa: తల్లితో పాటే ఆస్పత్రిలో అవినాశ్ రెడ్డి.. సీబీఐ నోటీసులతో మళ్లీ టెన్షన్ వాతావరణం

ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు...

Update: 2023-05-20 12:12 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. వివేకానందారెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఈ మేరకు ఆయనను విచారించేందుకు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి రావాలని పేర్కొన్నారు.

కాగా అవినాశ్ రెడ్డి.. శుక్రవారమే విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ అనారోగ్యం దృష్ట్యా ఆయన విచారణకు హాజరుకాలేదు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయం వరకు వెళ్లిన ఆయనకు తన తల్లి లక్ష్మమ్మ అస్వస్థతకు గురి అయినట్లు ఫోన్ రావడంతో తిరిగి పులివెందులకు వెళ్లారు. తల్లి లక్ష్మమ్మను పరామర్శించి మెరుగైన వైద్యం చేయిస్తున్నారు. అటు తండ్రి భాస్కర్ రెడ్డి రిమాండ్‌లో ఉండటంతో తల్లి లక్ష్మమ్మతో పాటు అవినాశ్ రెడ్డి కూడా ఆస్పత్రిలో ఉన్నారు. ఎప్పటికప్పుడు దగ్గరుండి తల్లికి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. ఈసారి కూడా విచారణకు గైర్హారవుతారా..?, లేదా విచారణకు వెళ్తారా అనేది చూడాలి. 

Tags:    

Similar News