40కి పైగా కేసులు.. ప్రొద్దుటూరు కోర్టుకు వర్రా రవీందర్ రెడ్డి
అసభ్య పోస్టుల కేసులో వర్రారవీందర్ రెడ్డిని పోలీసులు ప్రొద్దుటూరు కోర్టులో ప్రవేశ పెట్టారు..
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్(YS Jagan) హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena Chief Pawan Kalyan), టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(TDP National General Secretary Nara Lokesh), టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత(TDP woman leader Vangalapudi Anita)పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. అయితే అప్పట్లో ఆయనపై కేసులు నమోదు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయా పార్టీల నేతలు వర్రా రవీందర్ రెడ్డి(Varra Ravinder Reddy)పై రాష్ట్రంతో పాటు హైదరాబాద్(Hyderabad)లోనూ ఫిర్యాదులు చేశారు. దీంతో వర్రారవీందర్ రెడ్డిపై దాదాపు 40 కేసులు నమోదు అయ్యాయి.
కడపకు చెందిన రవీంద్రారెడ్డిపై కడప జిల్లా వ్యాప్తంగా 10 కేసులు నమోదు అయ్యాయి. అయితే ప్రొద్దుటూరులో నమోదైన కేసులో ఆయనను అదుపులో తీసుకున్నారు. పీటీ వారెంట్‌పై కడప నుంచి తీసుకొచ్చి ప్రొద్దుటూరులో కోర్టులో ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. ఇవే కేసుల్లో నెల్లూరు, భీమవరానికి చెందిన ఇద్దరు అనుమానితులకు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Read More..
Road Accident:ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. ముగ్గురు మృతి