Ys Viveka Murder Case: ఎంపీ అవినాశ్‌రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ

దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి విచారణ ముగిసింది. గతంలో ప్రశ్నించిన సీబీఐ తాజాగా కూడా విచారించింది. ...

Update: 2023-02-24 12:05 GMT

దిశ,  వెబ్ డెస్క్: దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి విచారణ ముగిసింది. గతంలో ప్రశ్నించిన సీబీఐ తాజాగా కూడా విచారించింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. నాలుగున్నర గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించారు.అటు సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు అవినాశ్‌ సమాధానం ఇచ్చారు. అనంతరం విడిచి పెట్టారు. అయితే మరోసారి హాజరుకావాలని అవినాశ్‌కు అధికారులు చెప్పలేదని తెలుస్తోంది.

కాగా వివేకా హత్య కేసు విచారణను తెలంగాణ సీబీఐ కోర్టుకు బదిలీ చేయడంతో అధికారులు విచారణలో స్పీడు పెంచారు. ఇందులో భాగంగా పలువురుని సీబీఐ అధికారులు ఇప్పటికే విచారించారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని సైతం ఇటీవలే విచారించారు. మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో న్యాయవాదులతో కలిసి ఎంపీ అవినాశ్ రెడ్డి శుక్రవారం సీబీఐ కార్యాలయానికి వెళ్లారు.

అయితే గత నెల 28న తొలిసారి ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు అవినాశ్ రెడ్డి ఫోన్ కాల్స్‌పై ఆరా తీశారు. సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, సీఎం సతీమణి భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్‌కు పదే పదే ఫోన్లు వెళ్లినట్లు గుర్తించారు. 

Tags:    

Similar News