YS Vijayamma:వైఎస్ అభిమానులకు వైఎస్ విజయమ్మ సంచలన లేఖ

ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan), ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) మధ్య ఆస్తుల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-29 13:43 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan), ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) మధ్య ఆస్తుల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై రీసెంట్‌గా వైఎస్ షర్మిల బహిరంగ లేఖలు రాశారు. అయితే వారిద్దరి మధ్య ఆస్తుల వివాదం పై తాజాగా వైఎస్ విజయమ్మ(YS Vijayamma) స్పందిస్తూ వైఎస్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ‘‘తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావట్లేదని విజయమ్మ అన్నారు. జరుగుతున్న సంఘటనలు చూస్తే చాలా బాధేస్తోంది. నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరుగుతున్నాయి. మా కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. దయచేసి ఎవరూ కల్పిత కథలు రాయొద్దు.. వాళ్లిద్దరే(జగన్, షర్మిల) సమాధానం పొందుతారు. అన్న, చెల్లి ఇద్దరు అంగీకారానికి వస్తారని.. వాళ్లను రెచ్చగొట్టొద్దని విజ్ఞప్తి చేశారు. దేవుడు అన్నింటికీ పరిష్కారం చూపుతాడు’’ అని వైఎస్ విజయమ్మ లేఖలో పేర్కొన్నారు.

 

👉Also Read: షర్మిలకు అన్యాయం జరిగింది: వైఎస్ విజయమ్మ 

Tags:    

Similar News