మేనల్లుడి పెళ్లికి సీఎం జగన్ దూరం..? రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో షర్మిల కుమారుడి వివాహ వేడుకలు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమారుడి పెళ్లి జోధ్‌పూర్‌లో వైభవంగా నిర్వహిస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమారుడి పెళ్లి జోధ్‌పూర్‌లో వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియాల వివాహం వేడుకలు చేపట్టారు. ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో రాజారెడ్డి, ప్రియ వివాహ బంధంతో ఒకటయ్యారు. ఫిబ్రవరి 18న ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిల హల్దీ ఫంక్షన్ ఫోటోలు షేర్ చేశారు. కంగ్రాట్స్ ‘రాజా ప్రియా’ అంటూ నూతన వదువరులకు విషెస్ చెప్పారు.
మేనల్లుడి పెళ్లికి సీఎం జగన్ దూరం..?
షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఘనంగా జరగుతుంటే మేనమామ అయిన ఏపీ సీఎం ఈ వివాహానికి హాజరు కావడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ పరంగా షర్మిల సీఎం జగన్‌పై చేసిన విమర్శలే ఇందుకు కారణమని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. కాగా, గత నెల 18న హైదరాబాద్‌లో రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ నిశ్చితార్థ వేడుకకు సతీసమేతంగా సీఎం జగన్ హాజరయ్యారు. ఈ నిశ్చితార్థ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు.