Breaking: ఏపీ సీఎంకు, టీడీపీ అధినేతకు లేఖ రాసిన వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైఎస్ షర్మిల జోష్ పెంచారు.

Update: 2024-02-07 11:24 GMT

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైఎస్ షర్మిల జోష్ పెంచారు. ఓ వైపు రాష్ట్రంలో జిల్లాల వారీగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు సొంత అన్నని కూడా ఆలోచించకుండా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ చేసిన అభివృద్ధిని చూపించండి అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తున్నారు.

ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పించాలంటూ షర్మిల ఢిల్లీకి వెళ్లి మరి ధర్నా చేసిన విషయం తెలిసిందే. తాజాగా వైఎస్ షర్మిల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాసారు. ఏపీకి ప్రత్యేక హోదాతో సహా, విభజన హామీలు, అలానే ఈ 10 సంవత్సరాలలో కేంద్రం అమలు చెయ్యని హామీల గురించి చర్చించాలని కోరారు.

హామీలను అమలు చేసేందుకు ఏపీ ప్రజల హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలి పేర్కొన్నారు. ఇక అలానే ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించాలని వైఎస్ షర్మిల లేఖలో ప్రస్తావించారు.

Tags:    

Similar News