అన్న మానసిక పరిస్థితిపై ఆందోళన.. సీఎం జగన్‌కు అద్దం పంపిన షర్మిల

వైఎస్ జగన్ మానసిక పరిస్థితపై వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు....

Update: 2024-05-04 11:35 GMT

దిశ, వెబ్ డెస్క్:  సీఎం జగన్ మానసిక పరిస్థితిపై వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. పదే పదే చంద్రబాబు పేరును జగన్ జపించడంపై ఆమె సెటైర్లు వేశారు. ఏం జరిగినా చంద్రబాబునే కారణమని జగన్ చెబుతున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. అద్దంలో చూసుకుంటే జగన్‌కు చంద్రబాబు ముఖమే కనిపిస్తుందా అని ప్రశ్నించారు. జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్‌కు ఓ అద్దం పంపుతున్నానని, అందులో చూసుకోవాలని సూచించారు. అద్దంలో తనే కనిపిస్తున్నారో.. చంద్రబాబు కనిపిస్తున్నారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. తండ్రిని పోగొట్టుకున్న వైఎస్ సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారని జగన్ చెబుతున్నారని షర్మిల గుర్తు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం చంద్రబాబు వింటారని చెబుతున్నారని, మోదీతో పొత్తు కూడా చంద్రబాబు పనేనని జగన్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎంత పవర్ ఫుల్ అని జగన్ చెబుతున్నారో ఆలోచించాలన్నారు. సీఎం జగన్ మానసిక పరిస్థితిపై తనకు భయం వేస్తోందని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

Read More..

ఏపీలో అభివృద్ధిపై దుష్ప్రచారం.. సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం

Tags:    

Similar News