AP News:సీఎం చంద్రబాబు పై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ధ్వంసం చేసిన కేసులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-07-04 08:04 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ధ్వంసం చేసిన కేసులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లిని మాజీ సీఎం జగన్ నేడు (గురువారం) పరామర్శించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేశారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఫైరయ్యారు. నెల్లూరు జైలులో ఆయనను పరామర్శించిన తర్వాత మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడుతూ..చంద్రబాబుకు ఓటేయలేదనే కారణంతో రాష్ట్రంలో ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆయన అన్నారు. పైగా బాధితులపైనే దొంగ కేసులు పెడుతున్నారని వాపోయారు. ఇంత దారుణంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. టీడీపీ నాయకులే తమ పై దాడి చేసి తిరిగి కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్‌ఆర్ విగ్రహాలను తగలబెడుతున్నారని మండిపడ్డారు. మంచి పనులు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు ధోరణి మార్చుకోవాలి. లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారు అని మాజీ సీఎం జగన్ హెచ్చరించారు.

Tags:    

Similar News