రంగంలోకి వైఎస్ జగన్ భార్య భారతి.. పులివెందులలో జోరుగా ప్రచారం
కడప జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ భార్య భారతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు..
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆయన గెలుపుకోసం వైఎస్ భారతి పులివెందులలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంటింటికీ వెళ్లి ఓట్ల అభ్యర్థిస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎందుకు ఓట్లు వేయాలనేది వివరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అందించిన వివరాలను వివరిస్తూ ఈసారి కూడా గెలిపించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా వైఎస్ భారతి మాట్లాడుతూ వైసీపీ మెజార్టీని ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని చెప్పారు. పులివెందుల ప్రజలు ఎప్పుడూ వైఎస్ ఫ్యామిలీకి అండగా నిలిచారని తెలిపారు. ఈసారి కూడా వైఎస్ జగన్‌కే పట్టం కడతారని వైఎస్ భారతి జోస్యం చెప్పారు.
కాగా కడప జిల్లా ఎంపీ అభ్యర్థిగా జగన్ సోదరి వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో వైసీపీ నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి బరిలో నిలబడ్డారు. దీంతో వైఎస్ సునీతకు రంగంలోకి దిగారు. సోదరి వైఎస్ షర్మిలకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి కూడా రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మంచి చేసిన జగన్‌కే ఓటు వేయాలని కోరుతున్నారు. దీంతో కడప రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో ప్రజలు ఎవరికి మద్దతిస్తారో చూడాలి.