రూ. కోటి చొప్పున పరిహారం అందించాలి: వైఎస్ జగన్ డిమాండ్

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్‌ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు...

Update: 2024-08-21 16:53 GMT

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్‌ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మరణించినవారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్‌ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని సూచించారు. వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలని, తమ పార్టీ నాయకులతో కూడిన బృందం అక్కడ పర్యటించి, బాధితులకు తోడుగా నిలుస్తుందని చెప్పారు. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటివి జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి జగన్ సూచించారు.

Tags:    

Similar News