రాష్ట్రంలో మహిళా సంక్షేమ ప్రభుత్వం నడుస్తోంది: Mp Vijayasaireddy
ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని, రాష్ట్రంలో అక్క చెల్లమ్మలకు విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కల్పించాలని సీఎం జగన్ తపిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు..
దిశ,ఏపీ బ్యూరో: ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని, రాష్ట్రంలో అక్క చెల్లమ్మలకు విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కల్పించాలని సీఎం జగన్ తపిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు మహిళలకే రావాలని ఏకంగా అసెంబ్లీలోనే చట్టం చేశామని, అలాగే నామినేషన్ ద్వారా ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో కూడా 50 శాతం ఇవ్వాలని చట్టం చేశామని చెప్పారు. మహిళలకు జగన్ ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ముడోవ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రూ.6,419 కోట్లు విడుదల చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎర్లీబర్డ్ పేరిట ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించిందని చెప్పారు. 10 శాతం స్టాంప్ డ్యూటీ, ల్యాండ్ కన్వర్షన్ చార్జీలు తిరిగి చెల్లించడం, ఇన్ర్ఫా వ్యయంలో 50 శాతం గరిష్టంగా రూ.కోటి వరకు చెల్లించడం లాంటి ప్రోత్సహకాలను ప్రభుత్వం ప్రకటించిందని వెల్లడించారు.