అసెంబ్లీ స్పీకర్ తో భేటీ కానున్న వైసీపీ ఎమ్మెల్యేలు..ఆ అంశం పై చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. నేతల బదిలీలతో బహిరంగ సభలతో ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.

Update: 2024-01-29 08:30 GMT

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. నేతల బదిలీలతో బహిరంగ సభలతో ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అయితే వైసీపీ రెబల్స్ ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఈ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ గూటికి చేరారు. దీనితో ఆగ్రహించిన వైసీపీ అధిష్టానం పార్టీలు  మారిన నేతలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసింది.

దీనితో స్పీకర్ ఆ నలుగురు ఎమ్మెల్యేలను ప్రత్యక్ష విచారణకు తన కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేసారు. కాగా స్పీకర్ జారీ చేసిన నోటీసులను రద్దు చెయ్యాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. ఇక ఇప్పటికే స్పీకర్ విచారణకు హాజరైన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో మేకపాటి చంద్రశేఖర రెడ్డి, శ్రీదేవి తమకు తమ అభిప్రాయం చెప్పేందుకు మరింత సమయం కావాలని కోరారు.

కాగ మిగిలిన వారు హాజరుకావాల్సి ఉంది. అయితే పార్టీలు మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ల పైన విచారణ చేపట్టిన స్పీకర్ స్వయంగా ఎమ్మెల్యేలను తన కార్యాలయంలో హాజరు కావాలని  నోటీసులు జారీ చేయగా.. దీని పైన స్పందించిన వైసీపీ ఎమ్మెల్యేలు తమకు ఇచ్చిన నోటీసుల పైన మెటీరియల్ కావాలని కోరుతూ హై కోర్టులో పిటీషన్ వేశారు. కాగా ఆ పిటీషన్ విచారణకు హైకోర్టు  ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఏం జరుగనుందో అనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

Tags:    

Similar News