వాలంటీర్లపై చంద్రబాబునే విషం చిమ్మారు.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
మాజీ సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు...
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వాలంటీర్లపై సీఈసీ ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాలను వాలంటీర్లలో పంపిణీ చేయించొద్దని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. ఏప్రిల్ 1న పింఛన్ దారులకు నగదు పంపిణీ చేయాల్సిన సమయంలో సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. వాలంటీర్లపై టీడీపీ విషం చిమ్మిందని, అందుకే సీఈసీ ఆంక్షలు విధించిందని విమర్శలు చేస్తున్నారు. వైసీపీ మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లపై చంద్రబాబు కక్ష కట్టారని వ్యాఖ్యానించారు. పింఛన్ సౌకర్యాన్ని ఆపివేసేందుకు యత్నించారని పేర్ని నాని ఆరోపించారు.
సిటిజన్ ఫోరమ్ ఫర్ డెమోక్రసీ తెలుగుదేశం పార్టీ బినామి అని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో సిటిజన్ ఫోరమ్ ఫర్ డెమోక్రసీని ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు. ఆ సంస్థ సెక్రటరీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎవరో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసని చెప్పారు. ఒక హోటల్‌లో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ను కలిసిన వ్యక్తి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అని గుర్తు చేశారు. రాజకీయ ప్రేరిపితంతో సిటిజన్ ఫోరమ్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఏర్పాటు అయిందన్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదని ఆ సంస్థ కేసు వేసి ఆపించేసిందని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఆ సంస్థ ఎలక్షన్ వాచ్ కాదని.. అంతా టీడీపీ వాచ్ లేనని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అధికారులతో పింఛన్లు పంపిణీ చేయించాలని వారిపై ఎందుకు ఒత్తిడి పెంచుతున్నారని ప్రశ్నించారు. నారా భువనేశ్వరి చెక్కులు ఇస్తుంటే ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని నిలదీశారు. వాలంటీర్లపై చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి విషం చిమ్మారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాదిరిగా పేదలు పెన్షన్ల కోసం పడిగాపులు కాయాలా అని పేర్ని నాని ప్రశ్నించారు.
Read More..
‘చంద్రబాబు ప్రచారం అంతా అబద్ధాలే’..ప్రజా గళం సభ పై ఆ పార్టీ ఎమ్మెల్యే ధ్వజం!