AP News:‘జూ.ఎన్టీఆర్‌కు సభ్యత్వమైన ఇచ్చావా?’.. సీఎం చంద్రబాబు పై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో మాజీ సీఎం జగన్(YS Jagan), వైఎస్ షర్మిల(YS Sharmila) మధ్య తలెత్తిన ఆస్తుల వివాదం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Update: 2024-10-26 08:42 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మాజీ సీఎం జగన్(YS Jagan), వైఎస్ షర్మిల(YS Sharmila) మధ్య తలెత్తిన ఆస్తుల వివాదం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈ అంశంపై వైసీపీ నేత(YCP leader) పేర్ని నాని స్పందించారు. ఈ క్రమంలో షర్మిలను జగన్ మోసం చేశారన్న సీఎం చంద్రబాబు(CM Chandrababu) వ్యాఖ్యలకు వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని మాట్లాడుతూ.. జగన్‌కు షర్మిల వ్యక్తిగతంగా రాసిన లేఖ కూటమి ప్రభుత్వ(AP Government) అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటుందని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో వింత రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించిన టీడీపీ సభ్యత్వ నమోదు(TDP membership registration) పై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జూనియర్ ఎన్టీఆర్‌(Jr.NTR)ను చంద్రబాబు ఎంతగానో ఉపయోగించుకున్నారు. కానీ ఆయనకు ఇప్పటికీ టీడీపీ సభ్యత్వం(Membership of TDP) ఇవ్వలేదు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా అలాగే మోసం చేశారు. హోరిటేజ్‌లో ఆయన తోబుట్టువులకు ఏమైనా వాటాలు ఇచ్చారా? జగన్ ఇంట్లో చిచ్చు పెట్టి చంద్రబాబు చలి కాచుకుంటున్నారు’ అని పేర్ని నాని మండిపడ్డారు.

Tags:    

Similar News