విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై జగన్ బిగ్ ప్లాన్.. రేపు, ఎల్లుండి కీలక భేటీలు

విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుంది..

Update: 2024-08-12 13:34 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుంది. దీంతో గెలుపుపై వైసీపీ అధినేత జగన్ దూకుడు పెంచారు. జీవీఎంసీ స్థాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన ఆయన ఈ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించి.. ఆయనతో నామినేషన్ దాఖలు చేయించారు

ఇక విశాఖ జిల్లా స్థానిక సంస్థల పరిధిలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరిపడా సంఖ్యాబలం ఉంది. దీంతో ఈ ఎన్నికలో సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజా ప్రతినిధులను పక్కకు పోకుండా చూస్తున్నారు. ఇప్పటికే విశాఖ, పాడేరు, అరకు ప్రజా ప్రతినిధులతో వరుస భేటీ నిర్వహించారు. వారిలో కొందరిని బెంగళూరు క్యాంపుకు తరలించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో గెలుపు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. మిగిలిన నియోజకవర్గాల్లోని నేతలతో భేటీ కావాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా మంగళవారం, బుధవారం ఐదు నియోజకవర్గాల వైసీపీ ప్రజా ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేయాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలుస్తారనే నమ్మకంతో జగన్ ఉన్నారు. విశాక జిల్లాలో బొత్సకున్న పరిచయాలు ఈ ఎన్నికలో కలిసివస్తాయని జగన్ భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News