ఎన్నికల వేళ వైసీపీకి మరో BIG షాక్.. మాజీ మంత్రి రాజీనామా

ఎన్నికల వేళ అధికార వైసీపీకి అనూహ్య షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడారు.

Update: 2024-01-02 10:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ అధికార వైసీపీకి అనూహ్య షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. తాజాగా.. మరో కీలక నేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత దాడి వీరభద్రరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు.. రానున్న రోజుల్లో మరొకొంత మంది కీలక నేతలు పార్టీని వీడనున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Tags:    

Similar News