దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో కొండచిలువ (Python) కలకలం రేపింది. ఆదివారం మ్యూజియం సమీపం శృంగేరి మఠం వద్ద అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. 10 అడుగులకుపైనే కొండచిలువ పొడవు ఉంది. అటవీ ప్రాంతం నుంచి రోడ్డుపై వెళ్తూ కనిపించింది. వాహనదారులు రాకపోకలు సాగిస్తున్న సమయంలో రోడ్డుపై వెళ్తున్న కొండచిలువను చూశారు. దీంతో భయాందోళనకు గురయ్యారు. టీటీడీ(Ttd) అధికారులు అటవీశాఖ(Forest Department)కు వెంటనే సమాచారం అందించారు. దీంతో అటవీ అధికారులు స్నేక్ క్యాచర్ (Snake Catcher)ను ఘటనా స్థలానికి పంపారు. ఈ మేరకు కొండ చిలువను స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం తిరుమల మొదటి ఘాట్ రోడ్‌లో వదిలేశారు.