తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌కు ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులు

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-09-30 05:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌యాణికుల‌కు స‌మ‌యాభావం త‌గ్గించేందుకు హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌కు ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులను న‌డ‌పాల‌ని టీజీఎస్ ఆర్టీసీ యాజ‌మాన్యం నిర్ణ‌యించింది. మొద‌టి ద‌శ‌లో రెండు ఈ-గ‌రుడ బ‌స్సులను సోమ‌వారం నుంచి ప్రారంభించింది.

ఈ బ‌స్సులు బీహెచ్ఈఎల్‌-రామ‌చంద్ర‌పురం, మియాపూర్, నిజాంపేట క్రాస్ రోడ్స్, సైబ‌ర్ ట‌వ‌ర్స్, గ‌చ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌కు చేరుకుంటాయి. విజ‌య‌వాడ మార్గంలో వెళ్లే ప్ర‌యాణికులు ఈ బ‌స్సుల‌ను వినియోగించుకుని క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవాల‌ని సంస్థ కోరుతోంది. ఈ బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ కోసం http://tgsrtcbus.in వెబ్‌సైట్‌ని సంప్ర‌దించాల‌ని సూచిస్తోంది. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విషయాలు వెల్లడించారు.

 


Similar News