TS RTC: విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టీఎస్​ ఆర్టీసీ గుడ్‌న్యూస్..ఓఆర్ఆర్ మీదుగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ గరుడ​ బస్సులు

హైదరాబాద్(HYD) నుంచి విజయవాడ(Vijayawada) వెళ్లే ప్రయాణికులకు టీఎస్​ ఆర్టీసీ(TS RTC) యాజమాన్యం శుభవార్త చెప్పింది.

Update: 2024-09-29 22:13 GMT

దిశ, వెబ్‌డెస్క్:హైదరాబాద్(HYD) నుంచి విజయవాడ(Vijayawada) వెళ్లే ప్రయాణికులకు టీఎస్​ ఆర్టీసీ(TS RTC) యాజమాన్యం శుభవార్త చెప్పింది.బీహెచ్ఎల్(BHEL) డిపో నుంచి ఔటర్ రింగ్ రోడ్(ORR) మీదుగా విజయవాడ వెళ్లేందుకు కొత్తగా రెండు ఎలక్ట్రిక్ గరుడ(E-Garuda) బస్సులను సోమవారం నుంచి టీఎస్​ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత(Sri Latha) ఓ ప్రకటనలో తెలిపారు.ఈ ఎలక్ట్రిక్ బస్సులు రామచంద్రాపురం,బీరంగూడ,చందానగర్,మియాపూర్,నిజాంపేట్ క్రాస్ రోడ్స్,హౌసింగ్ బోర్డ్ మీదుగా జేఎన్టీయూ రైతు బజార్,మలేషియన్ టౌన్​షిప్,శిల్పారామం, సైబర్ టవర్స్,మై హోమ్ భుజా,సైబరాబాద్ కమిషనరేట్,టెలికాంనగర్ మీదుగా ఓఆర్ఆర్ నుంచి విజయవాడ వెళ్తాయన్నారు.దీంతో విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ జామ్ నుంచి విముక్తి కలుగుతుందన్నారు.ప్రతిరోజూ రాత్రి 9:30, 10:30కు రామచంద్రాపురం నుంచి బస్సులు బయలుదేరుతాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీలత విజ్ఞప్తి చేశారు.

మరోవైపు కొన్ని రోజులలో దసరా పండగ రాబోతోంది. దీంతో పండగను దృష్టిలో పెట్టుకొని టీఎస్​ ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా ఎక్కువ బస్సులను నడిపేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. విజయవాడలో కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల 3 నుంచి 12 వరకు జరగనున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వెళ్తుంటారు. ఇదే సమయంలో పాఠశాలలకు, కాలేజీలకు దసరా సెలవులు ఉన్నందున వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. దీంతో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అక్టోబర్​ 3 నుంచి 15 వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్​ ఆర్టీసీ అధికారులు ఇప్పటికే తెలియజేశారు.


Similar News