TGGDA: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా నరహరి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం(TGGDA) అధ్యక్షుడిగా సీనియర్ డాక్టర్ బి.నరహరి(B.Narahari),జనరల్ సెక్రటరీగా డాక్టర్ రాథోడ్ లాలూ ప్రసాద్(Rathod Lalu Prasad) ఎన్నికయ్యారు.

Update: 2024-09-29 23:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం(TGGDA) అధ్యక్షుడిగా సీనియర్ డాక్టర్ బి.నరహరి(B.Narahari),జనరల్ సెక్రటరీగా డాక్టర్ రాథోడ్ లాలూ ప్రసాద్(Rathod Lalu Prasad) ఎన్నికయ్యారు.హైదరాబాద్(HYD) ఉస్మానియా మెడికల్ కాలేజీ(Osmania Medical College)లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో 63 ఓట్లతో నరహరి గెలుపొందగా,రాథోడ్ లాలూ ప్రసాద్ 55 ఓట్లతో విజయం సాధించారు.ఈ మేరకు రిటర్నింగ్ అధికారి(Returning Officer) జి.ఎం.మొహిద్దీన్(G. M.Mohiddin) ఓ ప్రకటనలో తెలిపారు.TGGDA అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా నరహరి మాట్లాడూతూ.. డాక్టర్ల సమస్యలు,హక్కుల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని తెలిపారు.గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు,ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సృష్టం చేశారు.


Similar News