వైసీపీ బాదుడు మొదలుపెట్టింది..
దిశ, వెడ్‌డెస్క్: సంక్షేమం పేరుతో ఓ వైపు జగన్ బటన్ నొక్కుతూ మరోవైపు ఛార్జీల పేరుతో తిరిగి డబ్బును రాబట్టుకుంటున్నాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు
దిశ, వెడ్‌డెస్క్: సంక్షేమం పేరుతో ఓ వైపు జగన్ బటన్ నొక్కుతూ మరోవైపు ఛార్జీల పేరుతో తిరిగి డబ్బును రాబట్టుకుంటున్నాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. జగన్ పాలనలో విద్యుత్ డిస్కంలు నాశనమయ్యాయని, రాష్ట్రంలో డిస్కంలన్నీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయన్నారు. రాష్ట్ర డిస్కంలకు మొత్తం రూ.38,836 కోట్ల అప్పులున్నాయని, దీనిపై హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని తెలిపారు. ఈ బకాయిలు చెల్లించనందుకు ముందుగా జగన్ రెడ్డి తాడేపల్లి ఫ్యాలెస్ ఫ్యూజులను విద్యుత్ అధికారులు తొలగించాలని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు రూ.13,011 కోట్లు తాము బాకీపడిన తమ ఘన కీర్తిని కూడా వైసీపీ ప్రభుత్వం అఫిడవిడ్ లో పేర్కొందన్నారు. ఇంత ఘోరంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా పతనమైన అంశాన్ని కోర్టులో ఒప్పుకున్న దాఖలాలు దేశ చరిత్రలోనే లేవని అపహాస్యం చేశారు. 2014-19 కాలంలో వినియోగించిన విద్యుత్‌కు ఇప్పుడు ట్రూఅప్ ఛార్జీల వసూలు చేయడం జగన్ దోపిడీ విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల నుంచి ట్రూఅప్ ఛార్జీల వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూనట్టు తెలిపారు.