CM Chandrababu:అమరావతిలో విజయవాడ, గుంటూరు కలిసిపోతాయి!?

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది.

Update: 2024-12-13 12:31 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) నేడు(శుక్రవారం) స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్(Swarnandhra@2047 Vision Document) ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. కలెక్టర్ల సదస్సులో భాగంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని అమరావతిలో విజయవాడ, గుంటూరు నగరాలు క్రమంగా కలిసిపోయే వీల ఉన్నందున ఇప్పటి నుంచే వాటి సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పట్టణీకరణ కూడా పెరగనున్నందున ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) వెలుపల ప్రాంతాల్లో ప్రజల భవిష్యత్తు అవసరాలకు వీలుగా బృహత్తర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పర్యావరణ అభివృద్ధికై ప్రతి నెల మూడో శనివారం స్వచ్చాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.

Tags:    

Similar News