మానవ రూపంలో కొలువుదీరిన పరమ శివుడు.. ఆలయం ఎక్కడంటే?
శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలో శ్రీ సిద్దేశ్వర స్వామి కొలువుదీరారు.
దిశ,మడకశిర: శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలో శ్రీ సిద్దేశ్వర స్వామి కొలువుదీరారు.భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందినది.దేవాలయ నిర్మాణంలో ఇక్కడి శిల్ప సంపద,స్థల మహిమ, ప్రజల సంస్కృతి సంప్రదాయాల నుంచి మనం ఎంతో తెలుసుకోవచ్చు. వీరభద్ర సిద్దేశ్వర,హేంజేరు సిద్ధప్ప,మూర్కణప్ప,హేంజేరు భైరవ, యజ్ఞారీశ్వర ఇలా పలు నామాలతో కొలవబడే హేమావతి శివాలయము క్రీ.శ. 8-11వ శతాబ్దంలో నొళంబు రాజులు నిర్మించినది.హేమావతి నందు వెలసిన మానవరూపదారి అయిన పరమశివుని అతిపెద్ద శిలావిగ్రహం ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన శివాలయం.ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదిన సంబరాల్లో భాగంగా జాతర, సిరిమాను, పూల రథం, అగ్నిగుండం, చిన్న రథోత్సవం, బ్రహ్మ రథోత్సవం వంటి పెద్ద వేడుకలు జరుగును. శివరాత్రి సమయంలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సంగ్రహాలయం,హేమావతిలో శిథిలమైన ఆలయాల నుంచి ప్రాచీన రామాయణం, భాగవతం, భారత పురాణ గాథలు, దేవతా విగ్రహాలు, శిలా శాసనాలు ఇక్కడి మ్యూజియంలో భద్రపరచడం జరిగింది.
విగ్రహ సంపదలో వినాయకుడు,భైరవుడు, దక్షిణామూర్తి విగ్రహం, సూర్య దేవుడు, పరశురాముడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, సప్తమాతృకలు విగ్రహం, వీణాధర శివుడు ఇంకా ఎన్నెన్నో పూడికతీతల్లో అనేకం లభిస్తున్నాయి.మహేశ్వరుడు ఉమాదేవిల ఆదర్భ దంపతుల విగ్రహాలు ఇంద్రాణి, వరాహమూర్తి విగ్రహాలు, నెమలి వాహన కుమారస్వామి విగ్రహాలను మనం చూడవచ్చు.ప్రధాన ఆలయంలోని శివుని సహజ రూప విగ్రహం లాంటి చిన్నదైన భైరవ రూప విగ్రహం కూడా మ్యూజియంలో భద్రపరిచారు. మ్యూజియంలో ఎన్నెన్నో ప్రత్యేకమైన విగ్రహాలు చాలా ఆకర్షణీయం.శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా మినహాయించి అన్ని దేవాలయాలకు మండపంలో నంది ఉంటుంది.దొడ్డేశ్వర స్వామి ఆలయం హేమావతి ఆలయాల్లో నొళంబ రాజులు నిర్మించిన గొప్ప ఆలయం. ఈ దేవాలయానికి ఎదురుగా అతి పెద్ద నంది మండపంలో ఉంది. చోళ భైరవ స్వామి ఆలయం నొళంబ రాజుల కాలంలో ప్రజల భక్తిని, నమ్మకాలను పరిశీలించాలంటే చోళ భైరవస్వామి ఆలయం గూర్చి తెలుసుకోవాలి.
Read More..
ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు..