CM Jagan తో Gautham Adani భేటీ వెనుక మర్మమేంటి? : CPI Rama Krishna
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ భేటీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ భేటీపై సీపీఐ రాష్ట్రర కార్యదర్శి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌తో అదానీ రహస్య భేటీ వెనుక మర్మం ఏమిటని నిలదీశారు. ఈ భేటీ వివరాలను సీఎం వైఎస్ జగన్ ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. ‘అది వ్యక్తిగత భేటీనా? లేక వ్యవస్థీకృత భేటీనా?’ అని ప్రశ్నించారు. సీఎం జగన్‌తో అదానీ భేటీ ఇప్పుడు కాదు గతంలో కూడా జరిగిందని గుర్తు చేశారు. ఇన్నిటేషన్ ఇచ్చే క్రమంలో అదానీ సీఎం వైఎస్ జగన్‌తో 4 గంటలపాటు భేటీ అయిన విషయాన్ని రామకృష్ణ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే గంగవరం, కృష్ణపట్నం పోర్టులను, సోలార్ విద్యుత్ ఒప్పందాలను అదానీ కంపెనీకే అప్పనంగా వైసీపీ ప్రభుత్వం అప్పగించిందని ఆరోపించారు. అంతేకాదు ఏపీలో స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లు కూడా అత్యంత భారీ ధరకు అదానీకే కట్టబెట్టారు అని ఆరోపించారు. తాజాగాజగన్, అదానీల రహస్య భేటీతో ఏం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి : Cm Jagan తో Adani భేటీ.. ఏ అంశాలపై చర్చించారనేది గుంభనం!