ఆ గ్రామంలో యుద్ధ ప్రాతిపదికన త్రాగునీరు అందిస్తాం:ఎమ్మెల్యే
మండల పరిధిలోని చిన్నాహరివాణం గ్రామానికి యుద్ధ ప్రాతిపదికన త్రాగు నీరు అందించేటువంటి పనిని వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అధికారులకు ఆదేశించారు.
దిశ, ఆదోని రూరల్: మండల పరిధిలోని చిన్నాహరివాణం గ్రామానికి యుద్ధ ప్రాతిపదికన త్రాగు నీరు అందించేటువంటి పనిని వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అధికారులకు ఆదేశించారు. మంగళవారం చిన్నాహరివాణం గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నిన్నటి రోజు కుప్పకూలినటువంటి తాగునీటి ట్యాంకులు పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వాటర్ ట్యాంక్ కేవలం కట్టిన 14 సంవత్సరాలకే కుప్ప కూలడం చాలా బాధాకరమని అన్నారు.
ఈ వాటర్ ట్యాంక్ నిర్మించిన కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. వాటర్ ట్యాంక్ పైన వెంటనే చర్యలు మొదలుపెట్టి కూలి పోయిన ట్యాంకును పునర్ నిర్మించేటటువంటి పనిని తొందరలోనే పూర్తి చేస్తామని RWS అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం గ్రామస్తులతో గ్రామం లోని కూటమి నాయకులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల పై మాట్లాడటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో MPDOతో పాటు అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.