ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తాం: డీజీపీ ద్వారకా తిరుమలరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాంతిభద్రతలపై డీజీపీ ద్వారకా తిరుమలరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాంతిభద్రతలపై డీజీపీ ద్వారకా తిరుమలరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని, త్వరలో యాంటీ నార్కొటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో గంజాయి అరికట్టేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని.. అన్నారు. దీంతొ పాటుగా రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకుంటామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం, నేరాల నిర్మూలన కోసం ప్రధాన నగరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలీసుల కోసం కొత్త వాహనాలను కొనుగోలు చేస్తామని, అర్హులైన పోలీసులకు త్వరలో పదోన్నతులు ఇస్తామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పుకొచ్చారు.