AP News:శ్రీకాళహస్తిలో కురుస్తున్న జడివాన.. చెరువులకు చేరుతున్న నీళ్లు

చాలాకాలం తర్వాత శ్రీకాళహస్తి ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో సోమవారం నుంచి జల్లులు పడుతున్నాయి. మంగళవారం రాత్రి ఓ మోస్తరుగా వర్షం కురిసింది.

Update: 2024-10-16 09:17 GMT

దిశ,శ్రీకాళహస్తి: చాలాకాలం తర్వాత శ్రీకాళహస్తి ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో సోమవారం నుంచి జల్లులు పడుతున్నాయి. మంగళవారం రాత్రి ఓ మోస్తరుగా వర్షం కురిసింది. బుధవారం కూడా జల్లులు పడుతూనే ఉన్నాయి. దీంతో కుంటలు, చెరువులు కొంతవరకు నీటితో నిండుతున్నాయి. తిరుపతి ప్రాంతంలో ఓ మోస్తరు వర్షాలు పడుతుండడంతో స్వర్ణముఖి నదికి నీళ్లు చేరుతున్నాయి. ఈ ఏడాది జనవరి తర్వాత శ్రీకాళహస్తి ప్రాంతంలో వర్షాలు కురవడం ఇదే మొదటిసారి. అన్ని ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఎండిపోయి ఉండటంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నీళ్లు చేరుతున్నాయి.

వర్షాల వల్ల శ్రీకాళహస్తి ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. హౌసింగ్ బోర్డు కాలనీ, బృందమ్మ కాలనీ, చెంచులక్ష్మి కాలనీల్లో రోడ్లపై నీళ్లు చేరడంతో సానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల పట్టణంలో మురుగునీటి కాలువల పూడికతీత పనులు జరిగాయి. దీంతో వర్షం నీళ్ళు కొంత మేరకు సాఫీగా వెళుతున్నాయి. నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది అవంతరాలను తొలగిస్తున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురస్తాయనే సమాచారంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి వర్షం పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


Similar News