VISHAKA : విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్‌లో క్షుద్ర పూజల కలకలం..
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్టర్స్‌లో క్షుద్రపూజల కలకలం రేగింది.
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్టర్స్‌లో క్షుద్రపూజల కలకలం రేగింది. ఇవాళ క్వార్టర్స్ పరిధిలోని ఓ ఇంటి ఆవరణలో ఇవాళ ఉదయం మేక కళేబరం వేళాడుతూ కనిపించింది. ఎవరో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఇంటి ఆవరణలో క్షుద్రపూజలు నిర్వహించినట్లుగా ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దీంతో క్వార్టర్స్ ఉన్న ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, మేకను దొంగిలించి చంపేసినట్లుగా వారి విచారణలో తేలింది.