Satiguda Reservoir: నాటుపడవ బోల్తా.. ఒకరి మృతి.. మరొకరి కోసం గాలింపు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు సతిగూడా జలాశయంలో ప్రమాదం నెలకొంది...
దిశ, ఉత్తరాంధ్ర: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు సతిగూడా జలాశయంలో ప్రమాదం నెలకొంది. నాటుపడవలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. నాటుపడవతో ఇద్దరు వేటకు వెళ్లడంతో అప్పటికప్పుడే నది ప్రవాహం వేగం పెరిగింది. ఈ క్రమంలో పడవ అదుపు తప్పి మునిగింది. ఇద్దరు గల్లంతైన సమాచారంతో రెస్క్యూ బృందాలు గాలింపుతో మహిళ మృతదేహం లభ్యం అయ్యింది. మరొకరి కోసం గాలిస్తున్నారు.