Araku Tourists:అరకు పర్యాటకులకు గుడ్ న్యూస్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

అందమైన పర్వతాలు, పాలధారను తలపించే జలపాతాలు, కాఫీ తోటలు, మంచు కొండలు, జల సవ్వళ్ళు ఇలా ఎన్నో సుందరమైన దృశ్యాలు అరకులో మనం చూడవచ్చు.

Update: 2024-12-24 06:01 GMT
Araku Tourists:అరకు పర్యాటకులకు గుడ్ న్యూస్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నం టూరిజంకు వచ్చిన పర్యాటకులు తప్పక సందర్శించే ప్రాంతం ‘అరకు లోయ’. ఇక ఈ అరకు అందాల గురించి వర్ణించాలంటే.. అందమైన పర్వతాలు, పాలధారను తలపించే జలపాతాలు, కాఫీ తోటలు, మంచు కొండలు, జల సవ్వళ్ళు ఇలా ఎన్నో సుందరమైన దృశ్యాలు అరకులో మనం చూడవచ్చు. ఈ సుందర మనోహర దృశ్యాలు చూడడానికి పర్యాటకులు అరకు ప్రదేశానికి వెళ్తుంటారు. అంతేకాదు ఈ అందమైన దృశ్యాలు తమ కెమెరాల్లో బంధించుతారు. ప్రకృతి సోయగాల నడుమ సెల్ఫీలు దిగుతూ ఆనందంలో తేలియాడుతారు. ఈ నేపథ్యంలో తాజాగా అరకు పర్యాటకులకు తూర్పు కోస్తా రైల్వే శాఖ(East Coast Railway Branch) గుడ్ న్యూస్ చెప్పింది.

అరకు పర్యాటకుల(Araku tourists) రద్దీని దృష్టిలో పెట్టుకుని తూర్పు కోస్తా రైల్వే విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 11.45 గంటలకు అరకు చేరుకోనున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో అదే రోజుల్లో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుకోనున్నట్లు తెలిపారు. ఒక సెకెండ్‌ ఏసీ, ఒక థర్డ్‌ ఏసీ, 10 స్లీపర్‌ క్లాస్, 4 సాధారణ రెండో తరగతి, 2 జనరల్ కమ్‌ లగేజీ బోగీలతో ఈ ట్రైన్ సింహాచలం, కొత్తవలస, ఎస్‌.కోట, బొర్రా గుహలు మీదుగా రాకపోకలు సాగించనున్నట్లు తెలియజేశారు.

Tags:    

Similar News