
విశాఖ వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరిక
అమరావతికి చేరిన విశాఖ జీవీఎంసీ రాజకీయం
కార్పొరేషన్ లో భారీగా పెరుగుతున్న కూటమి బలం
రేపు అవిశ్వాసం పెట్టే అవకాశం
ఇటు గుంటూరు మేయర్ పీఠంపై నజర్
కీలక నగరాల్లో మేయర్ పదవులు కూటమి సొంతం!
దిశ డైనమిక్ బ్యూరో: విశాఖ జివిఎంసి రాజకీయం అమరావతికి చేరింది. ఈరోజు పదిమంది మంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ, జనసేనలో చేరారు. విజయవాడ నుంచి అమరావతికి వైసిపి కార్పొరేటర్లు చేరుకున్నారు. కార్పొరేటర్లు చల్లా సునీత, గేదెల లావణ్య, కెల్ల సునీత, భూపతి రాజు సుజాత, ముర్ర వాణి, తో పాటు మరో నలుగురు టిడిపి కూటమిలో చేరారు. దీంతో జివిఎంసిలో కూటమి పక్షం కానుంది. మేయర్ పీఠాలపై టీడీపీ గురి కూటమి పీఠం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 64. ప్రస్తుతం కూటమి బలం 54గా ఉంది. 10 మంది కార్పొరేటర్లను టీడీపీ, జనసేనలో ఇవాళ చేర్చుకుంటున్నారు. 19వ తేదీన అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. అవిశ్వాసం పెట్టడానికి కార్పొరేటర్ల నుంచి సంతకాలు టీడీపీ ప్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు సేకరిస్తున్నారు.
గుంటూరు మేయర్ పీఠంపై..
అమరావతి రాజధాని లో ప్రధాన నగరమైన గుంటూరు మేయర్ పీఠంపై కూడా కూటమి కన్ను చేసింది. నేటితో మేయర్ పదవీకాలం నాలుగేళ్లు పూర్తి కానుంది. మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి సిద్ధం అయ్యింది. అయితే దీనికంటే ముందుగానే మేయర్ గా పనిచేసిన కాబట్టి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కాపు రైటర్లు భేటీ అయ్యారు. మేయర్ పదవి కోసం టీడీపీ కార్పొరేటర్లు పోటీ పడుతున్నారు.