గాయపడిన భారీ తాచుపాము.. గ్రామస్తులు చేసిన పనికి అందరూ షాక్..!

సాధారణంగా పాములు కనిపిస్తే ఏ వ్యక్తికైన వెన్నులో వణుకు పుడుతుంది.

Update: 2023-04-13 09:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పాములు కనిపిస్తే ఏ వ్యక్తికైన వెన్నులో వణుకు పుడుతుంది. అక్కడ నుండి దూరంగా పారిపోతారు. లేదా కొంత మంది కాస్త ధైర్యం చేసుకుని చంపే ప్రయత్నం చేస్తారు. కానీ, పాముకు దెబ్బ తగిలిందని దానికి ఆపరేషన్ చేసి రక్షించే వారిని చూశారా..? అవును మీరు విన్నది నిజం. ఈ విచిత్ర సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సింగరాయపాలెం గ్రామంలో మాగాణిలో ఉన్న ఓ భారీ తాచుపాము వరి కోత మిషన్‌లో పడి గాయపడింది. అయితే వరి కోతలు కోసి 4,5 గడుస్తుండడంతో మిషన్‌లో ఇరుక్కుపోయిన పాము అలాగే ఉండిపోయింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న భారీ తాచుపామును చూసిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ గణేష్, వైద్యుడు రహేష్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న వారు గాయంతో ఉన్న పాముకు ఆపరేషన్ చేసి కట్టు కట్టారు. పాము కాస్త కోలుకున్న అనంతరం సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి విడిచిపెట్టారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Tags:    

Similar News