Tirumala: శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల విక్రయం.. విజిలెన్స్ అదుపులో దళారి
తిరుమలలో దళారి రాజశేఖర్‌ను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు...
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో దళారి రాజశేఖర్‌ను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏడు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను రూ. 27 వేలకు ఆయన విక్రయించారు. చెన్నైకి చెందిన భక్తులకు అమ్మినట్లు నిర్ధారణ అయింది. టీటీడీ పాలక మండలి సభ్యుడు సిఫార్సుతో రాజశేఖర్ టికెట్లు తీసుకున్నారు. అనంతరం ఈ టికెట్లను భక్తులకు అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారులు తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ‘వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పటివరకూ ఎన్ని విక్రయించారు.. ఈ విక్రయం వెనుక తిరుమలలో పని చేసే ఎవరి హస్తమైనా ఉందా.’ అనే కోణంలో విచారిస్తున్నారు.