Breaking : వెంకటేష్, రాణా కుటుంబ సభ్యుల పై కేసు నమోదు.. ఎందుకంటే..?

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ అలానే అయన కుటుంబసభ్యులు గత కొంతకాలంగా వివాదాలను ఎదుర్కొంటున్నారు.

Update: 2024-01-29 06:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్  అలానే అయన కుటుంబసభ్యులు గత కొంతకాలంగా వివాదాలను ఎదుర్కొంటున్నారు. సినీ హీరో వెంకటేష్, ఆయన సోదరుడు సురేష్ బాబు కి సంబంధించిన భూమిని నందకుమార్ అనే వ్యక్తికి లీజుకి ఇచ్చారు. లీజుకు తీసుకున్న నందకుమార్ ఆ భూమిలో రెస్టారెంట్ ను నడుపుతున్నారు. కొన్నాళ్ల తరువాత సురేష్ బాబు తన భూమి అమ్ముతానని చెప్పగా నందకుమార్ కొనడానికి సిద్ధమయ్యారు.

ఇక వెంకటేష్ భూమిని కూడా అమ్మాల్సిందిగా నందకుమార్ అడిగారు. అందుకు అంగీకరించని సురేష్ ప్రస్తుతానికి తనది మాత్రమే అమ్ముతానని అన్నారు. అందుకు నందకుమార్ ఒప్పుకుని రూ/ 3 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ రాయించుకున్నారు. అనంతరం నందకుమార్ వెంకటేష్ ను కలిసి భూమిని అమ్మమని అడగగా.. అందుకు వెంకటేష్ ప్రస్తుతానికి లీజుకి తీసుకోమని.. తాను ఎప్పుడైనా అమ్మాలి అనుకుంటే తనకే అమ్ముతానని చెప్పి MOA చేశారు.

ఇంతవరకు అంత సజావుగా సాగింది. అయితే సురేష్ బాబు నందకుమార్ కి అగ్రిమెంట్ చేసిన తరువాత మళ్ళీ రెండవసారి మరొకరి కూడా అగ్రిమెంట్ చేశారని ఆరోపించారు. ఇక తనను మోసం చేసారంటూ నందకుమార్ నాంపల్లి కోర్టులో పిటేషన్ వేశారు. ఆ పిటీషన్ పై విచారణ రాకముందే.. కోర్టు ఆదేశాలను అనుసరించకుండా డెక్కన్ కిచెన్ న్ని దగ్గుబాటి కుటుంబ సభ్యులు కూల్చివేశారని.. 60  మంది బౌన్సర్లను పెట్టుకొని వెంకటేష్ అతని కుటుంబ సభ్యులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు నందకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలానే కోట్ల రూపాయలు విలువైన ఫర్నీచర్ ఎత్తుకెళ్లారని నందకుమార్ ఫిర్యాదు చేసారు.

ఈ నేపథ్యంలో నటుడు వెంకటేష్, రాణా, అభిరాం, సురేష్ ల పై ఐపీసీ 448 , 452 , 380 , 506 , 120b , సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాల్సిందిగా నాంపల్లి కోరు ఆదేశించింది. కాగా ఈనెల 27 వ తేదీ వెంకటేష్, సురేష్ బాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. కాగా ఈ కేసు విషయం పైనే అన్నదమ్ములు ఇరువురు తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసారని సినీవర్గాల్లో చర్చకూడ జరుగుతోంది.

Tags:    

Similar News