Vijayawada:దుర్గమ్మ సన్నిధిలో హోం మంత్రి అనిత
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను ఈరోజు మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను ఈరోజు మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ పండితుల ఆశీర్వాదం అందుకున్నారు. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో భక్తుల కోసం ఏర్పాట్లను పరిశీలించారు. భవాని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆలయ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.