Venkaiah Naidu: అమరావతి పునరుజ్జీవంగా నేను భావిస్తున్నా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati) పునర్:నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati) పునర్:నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఘనంగా భూమి పూజ చేసి ప్రారంభించారు. ఐదు కోట్ల ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని మోస్తున్న అమరావతిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన రాజధాని రైతుల హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు. రాజధానిలో నిర్మాణ పనుల్ని మూడేళ్లలో పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఈ భూమి పూజపై భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. రాజధాని నిర్మాణానికి తిరిగి శ్రీకారంచుట్టడం సంతోషమని హర్షం వ్యక్తం చేశారు. అమరావతి పునరుజ్జీవంగా నేను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతి కోసం సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి. అభివృద్ధిలో దేశానికే ఆదర్శం కావాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.