Letter To DGP: Nara Lokesh పాదయాత్రకు అనుమతివ్వండి

ఈ నెల 27 నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న 'యువగళం' పాదయాత్రకు అనుమతివ్వాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు డీజీపీని కోరారు...

Update: 2023-01-09 09:57 GMT
  • లోకేశ్‌కు రాజకీయ ప్రత్యర్థులు, ఫ్యాక్షనిస్టుల నుంచి ప్రాణహాని ఉంది
  • పాదయాత్రలో కట్టుదిట్టమైన భద్రత కల్పించండి
  • డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 27 నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న 'యువగళం' పాదయాత్రకు అనుమతివ్వాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీని కోరారు. ఈ మేరకు సోమవారం లేఖ రాశారు. లోకేశ్ పాదయాత్రకు అనుమతితో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. డీజీపీకి రాసిన లేఖను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి జత చేశారు. లోకేశ్ పాదయాత్రకు సంబంధించిన వ్యవహారాలను ఆయన వ్యక్తిగత సిబ్బంది నరేష్ చూసుకుంటారని లేఖలో వెల్లడించారు. లోకేశ్‌ను టార్గెట్ చేస్తూ ఇటీవల సైతం కొంతమంది సంఘ విద్రోహ శక్తులు బెదిరింపులకు పాల్పడ్డారని లేఖలో గుర్తు చేశారు.


రాజకీయ వ్యతిరేకులు, ఫ్యాక్షనిస్టుల నుంచి లోకేశ్‌ ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో లోకేశ్ పాదయాత్రకు, రాత్రిళ్ల బసకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని లేఖలో కోరారు. భద్రతా ఏర్పాట్లు చూసుకునేలా రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలు ఇవ్వాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖలో కోరారు.

ఇవి కూడా చదవండి : Kuppam: తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లతో అరెస్టులా?

Tags:    

Similar News