Vangaveeti Radha: వంగవీటి రాధాకు హార్ట్‌ఎటాక్! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా (Vangaveeti Radha)కు గురువారం తెల్లవారుజామున స్వల్వ గుండెపోటు వచ్చింది.

Update: 2024-09-26 04:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా (Vangaveeti Radha)కు గురువారం తెల్లవారుజామున స్వల్వ గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు వంగవీటి రాధాకు యాంజియో చేసి స్టెంట్ వేశారు. 48 గంటల పాటు ఆయనను అబ్జర్వేషన్‌లో పెట్టామని, ప్రస్తుతం రాధా ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. మరోవైపు వంగవీటి రాధా‌కు హార్ట్ స్ట్రోక్ (Heart stroke) వచ్చిందనే విషయం మీడియాలో రావడంతో ఆయన అభిమానులు, అనుచరులు రాధా ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేస్తుండటంతో రాధా ఇంటి వద్ద కార్యకర్తల సందడి నెలకొంది. 


Similar News