విలువలు లేని మనుషులు సమాజానికి చేటు: జగన్, షర్మిల గొడవపై స్పందించిన చంద్రబాబు

వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు...

Update: 2024-10-24 12:43 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్(Saraswati Power and Industries Private Limited) వాటాల పంపకం విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(National Company Law Tribunal)ను వైఎస్ జగన్(YS Jagan) ఆశ్రయించారు. వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతివాదులుగా ఉన్న వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మతో పాటు పలువురికి ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ వివాదంపై రాజకీయ దుమారం చెలరేగింది. వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విమర్శలపై స్పందించిన వైఎస్ జగన్ .. టీడీపీపై విమర్శలు చేశారు. తన చెల్లి, తల్లి ఫొటోతో రాజకీయం చేస్తు్న్నారని మండిపడ్డారు. అందరి ఇళ్లలో ఇలాంటి వివాదాలుంటాయని చెప్పారు. తన గుర్ల పర్యటనను డైవర్ట్ చేసేందుకే టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో జగన్, షర్మిల గొడవపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పందించారు. తల్లి, చెల్లితో గొడవ అయితే తమను లాగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి సంపాదించిన ఆస్తి ఆయన భార్యకు రాదా అని ప్రశ్నించారు. ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. జగన్ లాంటి వ్యక్తితో రాజకీయం చేయాలంటే సిగ్గుగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఇకనైనా మానుకోవాలని సూచించారు. విలువలు లేని వ్యక్తులుతో సమాజానికి చెడు జరుగుతుందన్నారు. ఐదేళ్లు తనను ఇంట్లో నుంచి బయటికి రానివ్వలేదని గుర్తు చేశారు. ఇప్పుడు తాము ఆపాలంటే నిమిషం పట్టదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 


Similar News