Vande bharat : వందే భారత్ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
కేంద్రమంత్రి రామ్మెహన్ నాయుడు విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలు ప్రారంభించారు. భారత ప్రధాని మోడీ అహ్మదాబాద్ నుండి వర్చువల్ గా ఈ వందే భారత్ రైలును ప్రారంభించగా..
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి రామ్మెహన్ నాయుడు విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలును ప్రారంభించారు. భారత ప్రధాని మోడీ అహ్మదాబాద్ నుండి వర్చువల్ గా ఈ వందే భారత్ రైలును ప్రారంభించగా..స్టేషన్ నుంచి రామ్మోహన్ నాయుడు జెండా ఊపీ ప్రారంభించారు. కాగా ఇది విశాఖ జంక్షన్‌లో ఉత్తరాది రాష్టాలకు తొలి సెమీ హైస్పీడ్ రైలు గా నిలిచింది. ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలుపుతూ వందే భారత్ రైలు నడవనుంది. ఈ రైలుతో విశాఖ నుంచి నడిచే రైళ్ల సంఖ్య నాలుగుకు పెరిగింది. అవి విశాఖ-,సికింద్రాబాద్ మధ్య 2, విశాఖ-భువనేశ్వర్ మధ్య ఒకటి రాకపోకలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలు ప్రారంభం అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ రైల్వేజోన్‌కు త్వరలోనే భూమిపూజ నిర్వహిస్తామని.. దసరా పండుగ తర్వాత మంచి రోజు చూసుకొని పనులు ప్రారంభిస్తామని.. రైల్వే జోన్ కోసం పదేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల సాకారమవుతున్నాయన్నారు. వందేభారత్ స్వీపర్ రైళ్లను నడిపి ప్రపంచానికి మేకిన్ ఇండియా కెపాసిటీ చూపిస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.