మా వివాహానికి రండి: రామ్మోహన్ నాయుడిని ఆహ్వానించిన పీపీ సింధు

శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని భారత బాడ్మింటన్ స్టార్, తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధును ఢిల్లీలో కలిశారు...

Update: 2024-12-09 14:49 GMT

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి(Union Minister Rammohan Naidu)ని భారత బాడ్మింటన్ స్టార్, తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు(Indian Badminton Star Venkata Sindu)ను ఢిల్లీలో కలిశారు. రాజస్థాన్‌(Rajasthan)లో జరిగే తన విహహం(Wedding)కు రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు తన పెళ్లి పత్రికను ఆమె అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు...ఈ సందర్భంగా వీపీ సింధు(VP Sindhu)కు కంగ్రాట్స్ చెప్పారు. వరుడు వివరాలు అడిగి చేసుకున్నారు. పెళ్లికి వస్తానని సింధుకు తెలిపారు. అనంతరం పీవీ సింధు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కాగా పీపీ సింధు పెళ్లి నిశ్చయమైంది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయితో ఈ నెల 22న రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో వివాహం జరగనుంది. పీవీ సింధు, సాయిది పెద్దలు కుదిర్చిందని ఆమె తండ్రి పీవీ రమణ తెలిపారు. ఈ నెల 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరుగుతుందని చెప్పారు. పెళ్లి కార్యక్రమాలు ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయని సింధు తండ్రి రమణ పేర్కొన్నారు. 

Tags:    

Similar News