బిగ్ న్యూస్.. పోలవరం నిధులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి రూ.12,500 కోట్ల నిధులు ఆమోదం తెలపాలని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్ర మంత్రులతో జరిగిన మీటింగ్లలో కోరారు.
దిశ, వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి రూ.12,500 కోట్ల నిధులు ఆమోదం తెలపాలని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్ర మంత్రులతో జరిగిన మీటింగ్లలో కోరారు. కాగా ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్రం.. మొదటి దశ నిర్మాణానికి మొత్తం రూ. రూ.12,500 కోట్ల నిధులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పోలవరం పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉంది.