‘అడుగుదాం ఆంధ్ర’పేరుతో నిరుద్యోగుల నిరసన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి నిరసనలు ఎదురవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకవైపు అంగన్వాడీలు మరోవైపు మున్సిపల్ కార్మికులు ఇప్పటికే సమ్మెకు వెళ్లిన సంగతి తెలిసిందే.

Update: 2023-12-26 06:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి నిరసనలు ఎదురవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకవైపు అంగన్వాడీలు మరోవైపు మున్సిపల్ కార్మికులు ఇప్పటికే సమ్మెకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆడుదాం ఆంధ్రపేరుతో రాష్ట్రస్థాయిలో క్రీడాపోటీలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు రోడ్డెక్కి నిరసన తెలిపారు ‘అడుగుదాం ఆంధ్ర .. ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట’ పేరుతో రాష్ట్రంలో నిరుద్యోగులు ఆందోళనకు పిలుపునిచ్చింది. నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగాలే కానీ పరీక్షల సమయంలో ఆటలు కాదని జాబ్ క్యాలెండరు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో క్రీడా మైదానాలు బాగు చెయ్యాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. గుంటూరులో నల్లపాడు లయోలా కాలేజికి‘ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి వస్తున్నా ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వాలని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ , యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె పవన్ తేజ, ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు షేక్ కరీంలు ప్రయత్నించారు. వీరిని యువజన విద్యార్థి నాయకులను పోలీసులు చుట్టుగుంటలో అడ్డుకొని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని నగరం పాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Tags:    

Similar News