తిరుమలపై తుఫాన్ ఎఫెక్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనం(low pressure)గా మారింది.

Update: 2024-10-14 12:57 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనం(low pressure)గా మారింది. దీంతో ఏపీ రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) చెప్పుకొచ్చింది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఏర్పడిన తుఫాన్ ఎఫెక్ట్.. తిరుమల(Tirupati) దర్శనాలపై పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని టీటీడీ అధికారులు, సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. ఈ నెల 16 తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. అలాగే తిరుమలలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో.. భక్తులకు వసతి, దర్శనం, భోజనం, ప్రసాద పంపిణీ లో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో అధికారులకు ఆదేశించారు. అలాగే భారీ వర్షాల నేపథ్యంలో గాటు రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. అలాగే జేసీబీలు, అంబులెన్సులు, డాక్టర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.


Similar News