కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేట్.. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

శనివారం రాత్రి తుంగభద్ర డ్యామ్‌కు ఇన్ ఫ్లో తగ్గడంతో గేట్లు మూసేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా 19వ గేట్ మూసే సమయంలో చైన్ లింక్ తెగిపోయింది.

Update: 2024-08-11 03:55 GMT

దిశ, వెబ్ డెస్క్: శనివారం రాత్రి తుంగభద్ర డ్యామ్‌కు ఇన్ ఫ్లో తగ్గడంతో గేట్లు మూసేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా 19వ గేట్ మూసే సమయంలో చైన్ లింక్ తెగిపోయింది. దీంతో హోస్పెట్ డ్యామ్ 19వ గేట్ వరదలో కొట్టుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు డ్యాం పై ఎటువంటి ప్రభావం పడకుండా.. అన్ని గేట్లను తేరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సుంకేసుల జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతుంది. తుంగభద్ర డ్యామ్‌ గేట్ కొట్టుకుపోయిన ఘటనపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు అధికారులకు ఫోన్ చేసి పరిస్థితులపై సమాచారం తెలుసుకున్నారు. అలాగే తుంగభద్ర డ్యామ్‌ అధికారులు, నిపుణులతో మాట్లాడామని.. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ తుంగభద్ర డ్యామ్ రాయలసీమ రైతులకు జీవనాధారం.

Tags:    

Similar News