AP Govt: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
రాష్ట్ర ప్రభుత్వం(AP Govt:) కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం(AP Govt:) కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్(CS Nirab Kumar Prasad) ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థికశాఖ కార్యదర్శిగా రొనాల్డ్ రాస్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా కే.కన్నబాబుకు అదనపు బాధ్యతలు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీగా బి.అనిల్ కుమార్ రెడ్డి, కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అదనపు కార్యదర్శిగా గంధం చంద్రుడు, వ్యవసాయ, సహకార డిప్యూటీ సెక్రటరీగా డి.హరితను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.