అసలేం జరిగింది?: త్వరలోనే పెళ్లి..ఇంతలో యువతి ఆత్మహత్య

ఇష్టం లేని పెళ్లికి పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. తనకు ఇష్టం లేదని పేరెంట్స్, బంధువులకు చెప్పినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు.

Update: 2023-11-03 05:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఇష్టం లేని పెళ్లికి పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. తనకు ఇష్టం లేదని పేరెంట్స్, బంధువులకు చెప్పినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక ఇష్టంలేని పెళ్లి చేసుకుని జీవితాంతం అయిష్టంగా బతకడం ఎందుకు అనుకుంది. తన తల్లిదండ్రులను కూడా ఇక మార్చలేనని భావించిన ఆమె ఇక ఆత్మహత్యే శరణ్యం అని భావించింది. అంతే ఏడంతస్థుల భవనం నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం నెలకొంది. పుట్టపర్తి గోకులం సాయి శ్రీనివాస అపార్టమెంట్‌‌లో ఓ యువతి కుటుంబంతో జీవిస్తోంది. అయితే ఆ యువతికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆ పెళ్లి ఆమెకు ఇష్టం లేదు. కుటుంబ సభ్యులకు చెప్పినా ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారే తప్ప ఆమె మాటతో ఏకీభవించలేదు. దీంతో శుక్రవారం తెల్లవారు జామును ఏడంతస్తుల భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో ఇలా చావు డప్పు కొట్టాల్సిన పరిస్థితి రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అమ్మాయి జీవితం బాగుంటుందని మంచి సంబంధం కుదిరిస్తే ఇలా అర్థాంతరంగా చనిపోతుందని తాము ఊహించలేదని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. దీంతో ఆ ఇంట్లో విషాదచ్ఛాయలు అలముకున్నాయి.

Tags:    

Similar News