వైసీపీకి బిగ్ షాక్.. నేడు జనసేనలోకి ముగ్గురు కీలక నేతలు

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-26 02:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ ఊహించని విధంగా ఓటమి పాలైంది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. ఈ క్రమంలో పలువురు పార్టీ నేతలు వైసీపీని వీడి అధికార పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు, నేతలు కూడా పార్టీకి రాజీనామా చేసి కూటమి పార్టీలలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు.

అయితే మరో ముగ్గురు వైసీపీ కీలక నేతలు పార్టీని వీడి జనసేనలో చేరుతామని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, కిలారు రోశయ్య, సామినేని ఉదయభాను నేడు(గురువారం) జనసేనలో చేరనున్నారు. వీరితో పాటు పలువురు నేతలు కూడా పార్టీలో చేరుతారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వీరిందరికీ జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కండువా కప్పనున్నారు. కాగా ఇటీవల ఈ ముగ్గురు నేతులు పవన్‌ను కలిసి పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్న సంగతి తెలిసిందే.


Similar News